Markapuram: మొహర్రం జ్ఞాపకాలతో వీడ్కోలు కలనూతల ముంపు గ్రామం!

Markapuram: మార్కాపురం కలనూతల ముంపు గ్రామంలో భావోద్వేగ భరితంగా మొహర్రం వేడుకలు. వేర్వేరు ప్రాంతాలకు పునరావాసం పొందుతుండటంతో కన్నీటి వీడ్కోలు పలికిన గ్రామస్తులు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 30 Aug 2026 9:50 AM IST
Markapuram
X

Markapuram: మొహర్రం జ్ఞాపకాలతో వీడ్కోలు కలనూతల ముంపు గ్రామం!

Markapuram: కులమతాలకు అతీతంగా ఏటా ఐకమత్యంతో నిర్వహించుకునే మొహర్రం పర్వదినాన్ని ఇకపై అందరం కలిసి చేసుకునే అవకాశం ఉండదంటూ ముంపు గ్రామం కలనూతల వాసులు బోరున విలపించారు.

తమ గ్రామాన్ని, తమ అనుబంధాలను, తరతరాలుగా కలిసి జరుపుకుంటున్న పండుగ సంప్రదాయాలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో గ్రామస్తులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన మొహర్రం వేడుకల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కలనూతల గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు అక్కడ హృదయ విదారకంగా మారాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story