Kalluru: కల్లూరును కరువు మండలంగా ప్రకటించాలి!

Kalluru: కల్లూరు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేత కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ర్యాలీ చేపట్టారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 7 Oct 2026 3:11 PM IST
Kalluru
X

Kalluru: కల్లూరును కరువు మండలంగా ప్రకటించాలి!

Kalluru: నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు మండల రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు బిర్లా గేట్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహనికి పూలవేసి నివాళులర్పించి, జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. కాటసాని రామభూపాల్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ పంటలు కళ్లముందే ఎండిపోతుంటే కరువు లేదని ఎలా చెబుతారు కాటసాని రామభూపాల్ రెడ్డి కర్నూలు జిల్లా ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

వర్షాలు సకాలంలో కురుస్తాయని ఆశతో రైతులు పెట్టుబడులు పెట్టి సాగు ప్రారంభించారని, పంట ఒక దశకు వచ్చే వరకు కూలీల ఖర్చులు, విత్తనాలు, ఎరువులు తదితర వాటిపై భారీగా ఖర్చు చేశారని తెలిపారు. చివరకు కీలక దశలో వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో కూడా కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకుండా ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. పంట పొలాల్లోకి వెళ్లి పరిస్థితిని కళ్లారా పరిశీలిస్తే కరువు తీవ్రత అర్థమవుతుందని అన్నారు..

రైతులు పంటల బీమా కోసం తమ వద్ద ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి మరీ ప్రీమియం చెల్లించారని, అలాంటి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులకు బీమా, నష్టపరిహారం, కరువు సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..

65 శాతానికి పైగా వర్షపాతం లోటు ఉంటే కరువు లేదంటారా వ్యవసాయ అధికారులతో తాను మాట్లాడినప్పుడు, కల్లూరు మండలంలో వర్షపాతం లోటు 65 శాతానికి పైగా నమోదైందని, కరువు మండలంగా ప్రకటించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపించామని అధికారులు చెప్పారని కాటసాని తెలిపారు..

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నమోదైన వర్షపాతం లోటును పరిగణనలోకి తీసుకుని కరువు మండలంగా ప్రకటించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించినప్పటికీ, ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

అధికారులు తమ పరిధిలో నివేదిక పంపించామని చెబుతున్నారు. మరి ఆ నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కొన్ని గ్రామాలు చూసి మొత్తం మండలంపై నిర్ణయం ఎలా కల్లూరు పట్టణానికి సమీపంలోని కొన్ని గ్రామాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మండలంలో కరువు లేదని నిర్ణయించడం సరికాదన్నారు.

ఉల్లిందకొండ, చెట్లమలాపురం పెద్దటేకూరు, చిన్నటేకూరు, తడకనపల్లి బస్తిపాడు,కొంగనపాడు తదితర గ్రామాలకు వెళ్లి రైతుల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని సూచించారు.

ఆ గ్రామాల్లో పంటలు బాగా పండాయని, రైతులు నష్టపోలేదని నిరూపిస్తే.. కరువు మండలం కోసం మేము చేస్తున్న పోరాటం తప్పని ఒప్పుకుంటాం. కానీ క్షేత్రస్థాయిలో రైతులను అడగకుండా కార్యాలయాల్లో కూర్చొని లెక్కలు చూసి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు” అని అన్నారు.

నీటి వనరులు ఉన్నా రైతుల పొలాలకు నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. గతంలో నీటి వనరులను సమర్థంగా వినియోగించి గ్రామాల్లో తాగునీటి అవసరాలతో పాటు పంట పొలాలకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకున్నామని కాటసాని గుర్తు చేశారు.

బోర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో నీరు నిల్వ ఉండేలా చేసిన ప్రయత్నాల వల్ల గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా, పంటలకు కూడా కొంతమేర నీరు అందే పరిస్థితి ఉండేదన్నారు. అయితే ప్రస్తుతం నీటి వనరులు ఉన్నప్పటికీ రైతుల పొలాలకు నీరు అందించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు.

రైతుల సమస్యను రాజకీయం చేయడం కాదు. రైతుల కోసం పోరాటం. వైఎస్సార్‌సీపీకి రాజకీయంగా చేయాల్సింది ఏమీ లేక రైతుల సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నామని అధికార పార్టీ విమర్శించడం హాస్యాస్పదం. రైతుల పంటలు ఎండిపోతుంటే మానవత్వంతో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని కాటసాని అన్నారు.

కరువు ప్రకటన వల్ల రైతులకు నష్టపరిహారం, బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి ప్రభుత్వ సహాయం అందే అవకాశం ఉంటుందని, అందుకే రైతుల ప్రయోజనాల కోసం కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు.

చంద్రబాబు నాయుడుగారికి వర్షాలు కురిపించేంత శక్తి ఉందని చెబుతున్నారుగా.. నిజంగానే అంత శక్తి ఉంటే కర్నూలుకు వచ్చి వర్షాలు కురిపించండి. రైతుల పంటలను కాపాడండి. ఆయన వర్షాలు కురిపిస్తే పార్టీ భేదాలు మర్చిపోయి మేమే ముందుగా అభినందిస్తాం” అని కాటసాని అన్నారు.

రైతుల కష్టాలు కనిపిస్తున్నా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని కాటసాని రామభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు మండలంలోని అన్ని గ్రామాల రైతులు,కల్లూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL