Kovelakuntla: కోవెలకుంట్ల ఆర్యవైశ్య అధ్యక్షుడిగా కాలువ నాగేశ్వరరావు
Kovelakuntla: కోవెలకుంట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా లహరి జ్యువెలర్స్ అధినేత కాలువ నాగేశ్వరరావు 30 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
Kovelakuntla: కోవెలకుంట్ల ఆర్యవైశ్య అధ్యక్షుడిగా కాలువ నాగేశ్వరరావు
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణ ఆర్య సంఘం అధ్యక్ష ఎన్నికలకు గురువారం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నువ్వా నేనా అంటూ తలబడిన ఎన్నికలలో కాలువ నాగేశ్వరరావు (లహరి జ్యువెలర్స్ అధినేత ) 30 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.
మొత్తం 168 ఓట్లు పోల్ కాగా కాలువ నాగేశ్వరావు కు 99 ఓట్లు రాగా పత్యర్థి పెండేకంటి సుబ్రహ్మణ్యం కు 69 ఓట్లు పడ్డాయి 30 ఓట్ల మెజార్టీ తో కాలువ నాగేశ్వరావు ఘన విజయం సాధించారు. విజేత కాలువ నాగేశ్వరరావుకు ఎన్నికల పరిశీలకులు వినోద్ కుమార్ చేతుల మీదుగా ఎన్నికై నట్లు ధ్రువపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్యులందరూ నూతన అధ్యక్షుడికి సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు టంగుటూరి శీనయ్య ఇస్కాల ప్రసాదు, శిల్పా సుబ్రహ్మణ్యం కాలువ వెంకట సుబ్రహ్మణ్యం ఆనంద్ సుబ్రమణ్యం ఇటిక్యాల శరత్ బాబు శ్రీరామ సుబ్రహ్మణ్యం బనగానపల్లె టీవీ గోపాల్ భరతుడు తదితరులు పాల్గొన్నారు.




