Yemmiganur: ఎమ్మిగనూరుకు కొత్త సీఐ వచ్చారు.. అరాచకాలు చేస్తే ఊరుకోరు!
Yemmiganur: ఎమ్మిగనూరు నూతన సీఐగా కంబగిరి రాముడు బాధ్యతలు స్వీకరించారు.
Yemmiganur: ఎమ్మిగనూరుకు కొత్త సీఐ వచ్చారు.. అరాచకాలు చేస్తే ఊరుకోరు!
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు పట్టణ నూతన సీఐగా కంబగిరి రాముడు భాద్యతలుచేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న సీఐ శ్రీనివాసులు వీఆర్ కు వెళ్లారు. కర్నూలు ఎయిర్ పోర్టు సీఐగా విధులు నిర్వహిస్తున్న కంబగిరి రాముడు ఎమ్మిగనూరు సీఐగా వచ్చారా. ఈ సందర్బంగా నూతన సీఐ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. పట్టణ ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి మార్గం చూపుతానని తెలిపారు. ముందుగా నూతన సీఐకు పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ ఎర్రన్నలతో పాటు పోలీసు సిబ్బంది ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.




