Giddalur: ఈనెల 17 నుంచి కొమరోలులో కామూరి కుటుంబం పర్యటన!

Giddalur: కొమరోలు మండలంలో పంచాయతీల వారీగా పర్యటించనున్న కామూరి కుటుంబం. కదలలేని పేదల ఇళ్లకు ‘సుభోజనం’ ఆహారం పంపిణీ అని కామూరి రమణారెడ్డి వెల్లడి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 16 Sept 2026 2:58 PM IST
Giddalur
X

Giddalur: ఈనెల 17 నుంచి కొమరోలులో కామూరి కుటుంబం పర్యటన!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు ఈనెల 17వ తేదీ నుంచి కొమరోలు మండలంలో పంచాయతీల వారీగా కామూరి కుటుంబం స్వయంగా కార్యకర్తల వద్దకు వెళ్లి పలకరించి పది సంవత్సరాలపాటు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తామని కామూరి రమణారెడ్డి వెల్లడించారు. సుభోజనం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో కదలలేని పరిస్థితిలో ఉన్న పేదలందరికీ ఇంటికే ఆహారాన్ని అందించే కార్యక్రమం ఇప్పటికే బెస్టవారిపేట మండలంలో చేపట్టినట్లు వెల్లడించారు.

భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని రమణారెడ్డి తెలిపారు. ఈనెల 27వ తేదీన కొమరోలులో సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలానే అదేరోజు కొమరోలు మండలంలో సుభోజనం కార్యక్రమాన్ని చేపడుతున్నామని రమణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు గిద్దలూరు మాజీ వైస్ ఛైర్మన్ ఆర్డీ రామకృష్ణ , మాజీ సర్పంచ్ బాదం గోపాల్ , రాఘవరెడ్డి , బాలయ్య , వీరం రెడ్డి మోహన్ రెడ్డి , మురళి , వాసుదేవ రెడ్డి , నల్లగుంట్ల సర్పంచ్ ప్రసాద్ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU