Markapuram: మార్కాపురానికి వెలిగొండ జలాలు ఆలయంలో ఎమ్మెల్యే కందుల పూజలు!
Markapuram: జమ్మనపల్లి ముద్దసానమ్మ గండి ఆలయంలో సీఎం చంద్రబాబు పేరున మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు. వెలిగొండ జలాలపై ఆనందం.
Markapuram: మార్కాపురానికి వెలిగొండ జలాలు ఆలయంలో ఎమ్మెల్యే కందుల పూజలు!
Markapuram: మార్కాపురం జిల్లా జమ్మనపల్లిలో వెలిగొండ ప్రాజెక్టు జలాలు త్వరలో మార్కాపురం ప్రాంతానికి రానున్న నేపథ్యంలో జమ్మనపల్లిలోని ముద్దసానమ్మ గండి అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మీద మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వెలిగొండ జలాలతో మార్కాపురం ప్రాంతం సస్యశ్యామలం కావాలని, రైతుల సాగు, ప్రజల తాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అసాధ్యం అనుకున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు.
జలాలు విడుదల సందర్భంగా నియోజకవర్గంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Next Story




