Markapuram: కనిగిరిలో మౌలాభి మృతదేహంతో హైవేపై బంధువుల ధర్నా!
Markapuram: కనిగిరిలో మౌలాభి మృతదేహంతో హైవేపై బంధువుల నిరసన. శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్, ఓఎస్డీ హామీతో సర్దుమనిగిన ఉద్రిక్తత.
Markapuram: కనిగిరిలో మౌలాభి మృతదేహంతో హైవేపై బంధువుల ధర్నా!
Markapuram: మార్కాపురం జిల్లా కనిగిరికి చేరుకున్న మౌలాభి మృతదేహంతో హైవేపై బయటయించి నిరసన వ్యక్తం చేశారు.
శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మౌలాభి బంధువులు ఆందోళనకు దిగారు. మౌలాభి మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు.
కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని బంధువులు స్పష్టం చేశారు. దీంతో సంఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకున్నారు.
ఒక దశలో మార్కాపురం జిల్లా ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా డ్రామాలు చేస్తున్నారని అనడంతో మృతుల బంధువులకు పోలీసులకు వాగ్వాదం జరగడంతో కొంతమంది పెద్దలు మౌలాభి భర్త సయ్యద్ అలీతో చర్చలు జరిపారు. కోచింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకుంటామని ఓఎస్డీ హామీ ఇవ్వడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.




