Kurnool: దేవనకొండలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం!

Kurnool: దేవనకొండ జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధికకు రాష్ట్ర బోయ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ సంపూర్ణ మద్దతు.

G Jagadeesh, Pathikonda
Published on: 31 Oct 2026 1:45 PM IST
Kurnool
X

Kurnool: దేవనకొండలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం!

Kurnool: తెలుగుదేశం పార్టీ దేవనకొండ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ షేక్ సాధిక రాష్ట్ర బోయ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

శనివారం కప్పట్రాళ్ల బొజ్జమ్మ స్వగృహంలో ఆమెను కలిసిన డాక్టర్ షేక్ సాధిక తనకు పార్టీ అధిష్టానం జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. తాను ఈ ప్రాంత కోడలినని, తనను సొంత బిడ్డలా ఆదరించి, ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ సమిష్టిగా కృషి చేసి విజయం సాధిద్దామని కోరారు.

ఈ సందర్భంగా డాక్టర్ సాధిక మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు. చంద్రబాబు ఆశయాల సాధనే తమ లక్ష్యమని తెలిపారు. రాజకీయ అనుభవం కలిగిన కప్పట్రాళ్ల బొజ్జమ్మ తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం కప్పట్రాళ్ల బొజ్జమ్మ స్పందిస్తూ టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధికకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేవనకొండ మండలంలోని టీడీపీ ఎంపీటీసీ, కూటమి అభ్యర్థుల విజయానికి కూడా కృషి చేస్తానని తెలిపారు.

మండలంలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda