Srisailam: శ్రీశైలం రుద్రవనంలో ఘనంగా కార్తీక వనభోజనాల కార్యక్రమం!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలంలోని రుద్రవనంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 25 Nov 2026 3:10 PM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలం రుద్రవనంలో ఘనంగా కార్తీక వనభోజనాల కార్యక్రమం!

Srisailam: కార్తీక వన భోజనాల కార్యక్రమం నిర్వహించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి ఈవో యం. శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ ఈశాన్యభాగంలోని రుద్రవనంలో (రుద్రాపార్కులో) ఈ కార్యక్రమం ఏర్పాటు నిర్వహించారు.

వనభోజన కార్యక్రమములో స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో యం. శ్రీనివాసరావు మరియు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. అలాగే శ్రీశైలదేవస్థానం అన్నీ విభాగాల అధికారులు, సిబ్బంది కుటుంబసమేతంగా పాల్గొన్నారు.

అదేవిధంగా పలుస్థానిక ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు.

కార్యక్రమములో ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి రుద్రవనములోని ఉసిరిచెట్టుకు సంప్రదాయబద్దంగా పూజాదికాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమములో తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు వారు మాట్లాడుతూ వైదికసంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా మరియు ఆలయ సంప్రదాయాలపై అందరికి అవగాహన కల్పించాలనే భావనతో ఈ వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

సంప్రదాయబద్దంగా వనభోజనాలు చేయడం వలన విశేషఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయన్నారు.

అనంతరం కార్యనిర్వహణాధికారి ఈవో యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రంలో వనభోజనాలు ఆచరించడం వల్ల మరింత ఫలితం లభిస్తుంది.

శ్రీశైలాన్ని క్షేత్రంగానే కాకుండా గొప్పతీర్థంగా కూడా మన పురాణాలు పేర్కొన్నాయన్నారు. ఈ క్షేత్రం ఎన్నో తీర్థాలకు నిర్వహిస్తున్నారు శ్రీశైల మహాక్షేత్రానికి అనాది క్షేత్రం అనే ప్రసిద్ధి ఉందన్నారు. యుగయుగాలుగా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భూ మండలానికి నాభిస్థానంగా ఈ క్షేత్రం పేర్కొనబడిందని, అందుకే మనం ఆచరించే వైదిక కార్యక్రమాలు, పూజాదికార్యక్రమాలలో చెప్పే సంకల్పంలో మన ఉనికిని శ్రీశైలక్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెప్పడం జరిగినది.

ఈ సందర్భంగా కార్తీకమాసం – వసభోజనాల విశిష్టత అనే అంశంపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ నోరి నారాయణమూర్తి, తెనాలి వారు ప్రవచనాన్ని వినిపించారు. అనంతరం లిక్షితాశ్రీ నృత్యకళాశాల, నందికొట్కూరు వారిచే సంప్రదాయనృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM