Nandyal: గోరుకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించిన వైసీపీ నేతలు!

Nandyal: గోరుకల్లు రిజర్వాయర్‌ను వైసీపీ నేతలు పరిశీలించారు.కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే కట్ట కుంగిపోయిందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు.

R Pavankalyan, Nandyal
Published on: 4 Aug 2026 4:23 PM IST
Nandyal
X

Nandyal: గోరుకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించిన వైసీపీ నేతలు!

నంద్యాల జిల్లా: పాణ్యం మండలంలోని గోరుకల్లు రిజర్వాయర్‌ను వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ కట్ట పరిస్థితిని స్థానిక నేతలతో కలిసి పరిశీలించి, అధికార ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి, గంగుల నాని తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... గోరుకల్లు రిజర్వాయర్ కట్ట కుంగిపోవడంతో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కరకట్ట బలహీనంగా ఉన్న విషయం ముందుగానే తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.

రాయలసీమకు ముఖ్యమంత్రి చేస్తున్న అన్యాయానికి గోరుకల్లు ప్రాజెక్టే నిదర్శనమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో 90 శాతం పూర్తయ్యాయని, అయితే గత రెండేళ్లుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

R Pavankalyan, Nandyal

R Pavankalyan, Nandyal

Next Story