Kodumur: ఈ నెల 12న కోడుమూరు CHCలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
Kodumur: సేవా సంకల్ప్ అభియాన్–2026లో భాగంగా ఈ నెల 12న కోడుమూరు సీహెచ్‌సీలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు డా. బి. నాగరాజు తెలిపారు.
Kodumur: ఈ నెల 12న కోడుమూరు CHCలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
Kodumur: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్–2026లో భాగంగా ఈ నెల 12వ తేదీ సోమవారం కోడుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) ఆవరణలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డా. బి. నాగరాజు తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో ప్రజలకు ఉచితంగా సాధారణ వైద్య పరీక్షలతో పాటు రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), రక్తహీనత (అనీమియా), క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
కోడుమూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి కోరారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ఆరోగ్య శిబిరానికి హాజరై అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.




