Kurnool: కోడుమూరులో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజల ఇబ్బందులు! నిబంధనల పేరుతో బంకు యాజమాన్యం, ప్రజల మధ్య ఘర్షణ.
Kurnool: కోడుమూరులో పెట్రోల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
కర్నూలు జిల్లా: కోడుమూరులో పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన వాహనాలు. పట్టణంలో ఐదు పెట్రోల్ పంపులు ఉన్నాయి అందులో ఒక పంపులో మాత్రమే స్టాక్ రావడంతో రైతులు, జెసిబి వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యాన్లు వాటర్ బ్యాటిలతో బారులు తీరారు. ప్రభుత్వం, అధికారులు క్యాన్లలో వాటర్ బాటిలల్లో పోయరాదు అని నిబంధనలు విధించడంతో ప్రజలు అందరు బంకుల యాజమాన్యంతో గొడవకు దిగారు. తమకు డీజల్ పోయకపోతే బంకులను మూసి వేసుకోవాలని వాగ్వాదానికి దిగారు. యాజమాన్యం చేసేది ఏమీ లేక పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగింది. ప్రభుత్వం అధికారులు దీనిపై మరింత చొరవ చూపి ప్రతి పంపింగ్ స్టేషన్లో పెట్రోల్ డీజిల్ అందేలా చూడాలని కోరారు.
Next Story




