Kodumur: కల్లపరి ఆలయ చోరీ నిందితులను పట్టుకున్న పోలీసులు

Kodumur: కోడుమూరు మండలం కల్లపరి దుర్గమ్మ గుడిలో హుండీ చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

C. Ganesh, Kodumuru
Published on: 21 April 2026 6:43 PM IST
Kodumur
X

Kodumur: కల్లపరి ఆలయ చోరీ నిందితులను పట్టుకున్న పోలీసులు

Kodumur: కోడుమూరు మండలం కల్లపరి గ్రామంలోని దుర్గమ్మ గుడిలోని హుండీ చోరీ చేసిన దుండగులను పట్టుకున్న పోలీసులు. కోడుమూరు లోని లక్ష్మి నగర్ కి చెందిన నలుగురు యువకులు జల్సాలకు అలవాటు పడి వారి ఖర్చులకు డబ్బులు దొరక మార్చి 23 తేదీన కల్లపరి దుర్గమ్మ ఆలయంలో ఉన్న హుండీని చోరి చేశారు.

ఈ రోజు ఆ డబ్బును దొంగలు పంచుకుంటున్న సందర్భంలో పోలీసులు వారిని పట్టుకొని వారి దగ్గర నుండి 9,59,300/- నగదు , ఒక పల్సర్ బైక్ ను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ తబ్రేజ్ తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరు పరచడం జరుగుతుందని తెలిపారు. నిందితుల్ని పట్టుకున్న వారి సిబ్బందిని ఎస్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ డివై స్వామి , కానిస్టేబులు మద్దేశ్వర్, భాస్కర్, మద్దిలేటి పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story