Kodumuru: కోడుమూరు పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లు కరువు వృద్ధులు దివ్యాంగుల అవస్థలు!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో వీల్‌చైర్లు లేక వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరారు.

C. Ganesh, Kodumuru
Published on: 5 Nov 2026 8:23 AM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరు పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లు కరువు వృద్ధులు దివ్యాంగుల అవస్థలు!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు వస్తున్న వృద్ధులు, దివ్యాంగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీరికి సహాయంగా పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లను ఏర్పాటు చేయాల్సిన ఎన్నికల అధికారులు ఆ ఏర్పాట్లను మర్చిపోయారు. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు స్పందించి వీల్‌చైర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru