Kodumuru: కోడుమూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో వాల్మీకి బలరాం!

Kodumuru: కోడుమూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో వాల్మీకి బలరాం పోటీకి సిద్ధమయ్యారు. అభివృద్ధి, తాగునీరే ప్రధాన అజెండాగా వెల్లడి.

C. Ganesh, Kodumuru
Published on: 16 Oct 2026 6:09 PM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో వాల్మీకి బలరాం!

కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించడంతో, సర్పంచ్‌గా పోటీ చేసేందుకు వాల్మీకి బలరాం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దీంతో కోడుమూరు రాజకీయాల్లో సర్పంచ్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా బలరాం ముందుకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజలపై పన్నుల భారం తగ్గింపు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం.

అలాగే ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాననే హామీతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వాల్మీకి బలరాం సర్పంచ్ బరిలో నిలుస్తారా? అన్నది కోడుమూరులో ఆసక్తికరంగా మారింది.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru