Kurnool: కోడుమూరు కార్యకర్తలకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు!
Kurnool: వైఎస్ జగన్ కర్నూలు పర్యటనను విజయవంతం చేసిన కోడుమూరు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Kurnool: కోడుమూరు కార్యకర్తలకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కృతజ్ఞతలు!
Kurnool: కర్నూలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనలో స్వచ్ఛందంగా పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోడుమూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు మాజీ కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకం, అభిమానంతో కోడుమూరు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని జగన్ పర్యటనను భగ్నం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ, కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పర్యటనలో పాల్గొన్నారని కొనియాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా గాలికొదిలేసిందని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి విమర్శించారు. కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజల పక్షాన వైసీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆదిమూలపు సతీష్, జెడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి,సాజిత్, రమేష్ నాయుడు , కృషారెడ్డి,రవి రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




