Don: డోన్‌లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!
Don: డోన్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు; మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం, అన్నదానం, స్వెటర్ల పంపిణీ.
Don: డోన్‌లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!
Don: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డోన్ పట్టణంలో జనసేన పార్టీ నాయకులు ఆల మోహన్ రెడ్డి, మైఖేల్ ఆధ్వర్యంలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరంతో పాటు పేదలకు స్వెటర్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హాజరై కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. పేదలకు స్వెటర్లు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




