Kurnool: కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి వేడుకలు!

Kurnool: కిసాన్ ఘాట్‌లో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి. నివాళులర్పించిన కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, రఘువీరారెడ్డి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 16 Aug 2026 4:50 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106వ జయంతి వేడుకలు!

Kurnool: మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 106 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని కిసాన్ ఘాట్ లో ఉన్న విజయభాస్కర్ రెడ్డి సమాధి వద్ద తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించారు. డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి కోట్ల సమాధికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘు వీరారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం డబ్బుంటేనే రాజకీయాలు కొనసాగుతున్నాయని ఈ సంస్కృతి మంచిది కాదన్నారు. రాజకీయాలకు వస్తున్న యువత కోట్ల విజయభాస్కర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛమైన రాజకీయం చేయాలనీ ఆయన సూచించారు.

ఎన్నికల్లో డబ్బు పంచాలనే ఆలోచనలు రాజకీయ నాయకులు మానుకోవాలని తెలిపారు. కేరళ మరియు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో డబ్బులు పంచకున్న అక్కడ ఎమ్మెల్యేలు గెలుస్తున్నారన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నారసింహ పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story