Nandyal: శ్రీశైలం జలాశయం పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్

Nandyal: నంద్యాల జిల్లాలో శ్రీశైలం జలాశయాన్ని కేఆర్ఎంబీ చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ పరిశీలించారు. భద్రత, నిర్వహణపై చర్చలు.

MAKKENA NAGESWAR RAO, MADHIRA
Published on: 21 April 2026 11:53 AM IST
Nandyal
X

Nandyal

Nandyal: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయాన్ని కేఆర్ఎంబీ (KRMB) చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ సందర్శించారు. జలాశయం ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ఆయన పలు అంశాలపై అధికారులతో చర్చించారు.

పర్యటనలో భాగంగా జలాశయం రోప్స్, గేట్లు, గ్యాలరీ, ప్లంజ్ పూల్, అప్రోచ్ రోడ్లను సమగ్రంగా పరిశీలించారు. అలాగే జలాశయం నమూనాను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

జలాశయ పరిశీలన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జలాశయ నిర్వహణ, భద్రతా చర్యలు, నీటి నిర్వహణపై చర్చించనున్నట్లు సమాచారం.

MAKKENA NAGESWAR RAO, MADHIRA

MAKKENA NAGESWAR RAO, MADHIRA

Next Story