Kurnool: కర్నూలు కళాశాలలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర వేడుకలు. జెండా ఆవిష్కరించిన డాక్టర్ సతీష్ చంద్ర. పాల్గొన్న విద్యార్థులు, సిబ్బంది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 15 Aug 2026 6:02 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు కళాశాలలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సతీష్ చంద్ర అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు.

డాక్టర్ సతీష్ చంద్ర మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, మానవతా విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. యువత దేశ భవిష్యత్తుకు పునాది అని, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డాక్టర్ ఎస్. నాగస్వామి నాయిక్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి తరం విద్యార్థులు కొనసాగించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వేడుకలను ఉత్సాహభరితంగా మార్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, కృష్ణమోహన్, రామకృష్ణ, సోమేష్, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్, ఇంతియాజ్, జబీన్ అక్తర్, సుజాత, గిరిజారాణి, సాయి శ్రావణి, జసింత, లావణ్య తదితరులు, అలాగే విద్యార్థులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story