Kurnool: న్యాయం చేయండి కలెక్టర్‌ను కలిసిన 90 ఏళ్ల వృద్ధురాలు!
Kurnool: ఆస్తి వాటా విషయంలో తనకు న్యాయం చేయాలని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరిని కలిసిన 90 ఏళ్ల పద్మావతమ్మ. ఆర్డీవోకు చట్టపరమైన చర్యల ఆదేశం.
Kurnool: న్యాయం చేయండి కలెక్టర్‌ను కలిసిన 90 ఏళ్ల వృద్ధురాలు!
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవనబండ గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు పద్మావతమ్మ జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
తన భర్త తదనంతరం ఆస్తి పంపకాలలో భాగంగా తన ముగ్గురు కుమారులకు ఎవరి వాటా వారికి ఇచ్చానని, ప్రస్తుతం తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున నా వాటా నాకు ఇప్పించి న్యాయం చేయాలని, చట్టపరమైన నిబంధనల మేరకు తనకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె కోరారు.
కలెక్టర్ స్పందించి, ఈ సమస్యపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కు పంపించారు.
Next Story




