Kurnool: పోలీస్ పోస్టుల భర్తీపై కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ధర్నా
Kurnool: కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ధర్నా. పోలీస్ పోస్టుల రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని, వయోపరిమితి పెంచాలని డిమాండ్.
Kurnool: పోలీస్ పోస్టుల భర్తీపై కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ధర్నా
కర్నూలు: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం, ఉద్యోగాల భర్తీలో యువత ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జీ. సంతోష్ కుమార్ విమర్శించారు. ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయకుండా పరిమిత సంఖ్యలో నోటిఫికేషన్లతో సరిపెట్టడం వల్ల వేలాది మంది నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందన్నారు.
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు జీ. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర అసెంబ్లీలో పోలీస్ శాఖలో 20వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర డిజిపి కోరిన ప్రకారం 11639 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతుల పంపుతున్నామని వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మాయమాటలతో మోసం చేసి ఇప్పుడు కేవలం 2050 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ముమ్మాటికి నిరుద్యోగులను మోసం చేయడమే అన్నారు.
కావున కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రకటనలకు మాత్రమే పరిమితమై ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తే ఆధ్వర్యంలో నిరుద్యోగులను కలుపుకొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి పోలీస్ శాఖ కాళీ పోస్టుల మొత్తానికి రీ నోటిఫికేషన్ వచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేయడానికి పాలకుల నిర్లక్ష్యం వల్ల 7 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రావడం జరిగిందని ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ లేకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి ఎదురుచూసి శాశ్వతం నిరుద్యోగులుగా మారే ప్రమాదం కావున ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితిని 35 సంవత్సరాల కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల పైన సరైన సమాచారం లేకపోవడం సిగ్గుచేటు అన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అలా కాకుండా ప్రకటనలకే పరిమితం అవుతాం నిరుద్యోగులను మోసం చేస్తామంటే ఏఐవైఎఫ్ గా నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని వారి హెచ్చరించారు.
కార్యక్రమంలో నిరుద్యోగుల జేఏసీ నాయకులు నాగార్జున, వాలంటీర్ అసోసియేషన్ నాయకులు మహబూబ్ బాషా, జిల్లా ఆఫీస్ బేరర్స్ రమేష్, హునుమేష్, బిసన్న, రాజీవ్, రాజు, జిల్లా సమితి సభ్యులు రాజు నాగరాజు అంజిత్, జాఫర్ పటేల్, చిన్న, సురేష్, శ్రీకాంత్, కళాఖర్, చంటి, అఖిల్, రవి, తదితరులు పాల్గొన్నారు.




