Kurnool: కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ కళాశాల విద్యార్థులకు రికార్డుల పంపిణీ!
Kurnool: కర్నూలు బి. క్యాంప్‌లోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ ప్రాక్టికల్ రికార్డులు పంపిణీ చేశారు.
Kurnool: కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ కళాశాల విద్యార్థులకు రికార్డుల పంపిణీ!
కర్నూలు: కర్నూలు బి. క్యాంప్‌లోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విద్యార్థులందరికీ ప్రాక్టికల్ పరీక్షలకు అవసరమైన రికార్డులను పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ సూచనల మేరకు, విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ రంజిత్ బాషా గారు మరియు రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD) డాక్టర్ సి. సురేష్ బాబు గారి ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రాక్టికల్ రికార్డులను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, వొకేషనల్ విద్యలో ప్రాక్టికల్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు థియరీతో పాటు ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రాక్టికల్ రికార్డులను క్రమం తప్పకుండా పూర్తి చేసి, ప్రయోగాత్మక అంశాలపై పూర్తి అవగాహన సాధించాలని సూచించారు.
అలాగే ఈ రికార్డులు విద్యార్థులు రాబోయే ప్రాక్టికల్ పరీక్షలకు సమర్థవంతంగా సన్నద్ధం కావడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్, కళాశాల స్టాఫ్‌తో కలిసి ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్ రికార్డులను అందించినందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ కి, విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ రంజిత్ బాషా కి మరియు రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD) డాక్టర్ సి. సురేష్ బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శారదీ పటేల్, సుజాత, లక్ష్మి, శ్రీధర్ మూర్తి, ఇంతియాజ్, జసింత, లావణ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




