Kurnool: దేవనకొండ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధికకు బీ-ఫామ్!
Kurnool: దేవనకొండ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధిక తరఫున బీ-ఫామ్ అందుకున్న సుభాన్. అందజేసిన ఆలూరు ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి.
Kurnool: దేవనకొండ జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ షేక్ సాధికకు బీ-ఫామ్!
Kurnool: దేవనకొండ మండల జడ్పీటీసీ అభ్యర్థిగా ఈదులదేవరబండ సుభాన్ బీ-ఫామ్‌ను టీడీపీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో భాగంగా ఈదులదేవరబండ సుభాన్ కోడలు డాక్టర్ షేక్ సాధిక కు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఈ క్రమంలో వైకుంఠం జ్యోతి చేతుల మీదుగా ఆయన బీ-ఫామ్ అందుకున్నారు. దీంతో దేవనకొండ మండలంలో రాజకీయంగా ఎన్నికల సందడి నెలకొంది.
ఈదులదేవరబండ సుభాన్ కోడలు డాక్టర్ షేక్ సాధిక పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రానున్న ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ప్రచార కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
జడ్పీటీసీ అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్న ఈదులదేవరబండ సుభాన్ కోడలు డాక్టర్ షేక్ సాధిక పార్టీ శ్రేణులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.




