Kurnool: గూడూరు 8, 6 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థుల తరఫున చరణ్ కుమార్ ప్రచారం!
Kurnool: గూడూరు 8, 6వ వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు హేమలత, సురేష్‌లకు మద్దతుగా మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ విస్తృత ప్రచారం. గెలిపించాలని విజ్ఞప్తి.
Kurnool: గూడూరు 8, 6 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థుల తరఫున చరణ్ కుమార్ ప్రచారం!
Kurnool: కర్నూలు జిల్లా గూడూరు నగరపంచాతీ 8, 6వ వార్డుల ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థులు హేమలత, సురేష్‌ల విజయమే లక్ష్యంగా మాజీ కౌన్సిలర్, యువ నాయకుడు చరణ్ కుమార్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు హేమలత, సురేష్‌లతో కలిసి చరణ్ కుమార్ వార్డుల్లోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వార్డు అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ చరణ్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు పట్టణంలోని 8, 6వ వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకుని 8, 6వ వార్డుల ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థులు హేమలత, సురేష్‌లకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.




