Kurnool: ఆసుపత్రి అభివృద్ధిపై అధికారుల ఆకస్మిక తనిఖీ

Kurnool: కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ కల్లూరు మండలం పర్ల గ్రామంలోని రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 2 May 2026 8:33 PM IST
Kurnool
X

Kurnool: ఆసుపత్రి అభివృద్ధిపై అధికారుల ఆకస్మిక తనిఖీ

Kurnool: కల్లూరు మండలం పర్ల గ్రామంలో ఆసుపత్రిని తనిఖీ చేసి అభివృద్ధి పనుల పరిశీలించిన అడిషనల్ డిఎం ఇ..& మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ. కర్నూల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న కమ్యూనిటీ మెడిసిన్ విభాగము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ పర్ల ఆసుపత్రిని అడిషనల్ డీఎంఇ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగపు అధిపతి వైస్ ప్రిన్సిపల్ డా. సింథియా శుభప్రద లు శనివారం సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓపిని పరిశీలించడం జరిగింది. ఓపి పెంచాలని గతంలో 120 దాకా ఓపి వచ్చేదని సూచించారు. డ్రగ్స్ స్టోర్ ను పరిశీలించిన వారు ఇద్దరు ఫార్మసిస్టులు ఉన్నారని డ్రగ్స్ ఎక్స్పైరీ డేట్ ల గురించి నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆధునికరించిన వార్డును, వాటర్ కనెక్షన్స్ పరిశీలించారు. ఆస్పత్రి గేటు వద్ద బోర్డు పెట్టాలని సంపు యొక్క హైట్ పెంచాలని ఆసుపత్రి స్థలం శుభ్రం చేసేందుకు,

హద్దులు నిర్దేశించి చుట్టూ కంచె ఏర్పాటుకు ప్రతిపాదనల సిద్ధం చేయాలని ఇంజనీర్ కు సూచించారు. మెడికల్ ఆఫీసర్ సెలవుల్లో ఉండటంతో సిబ్బందికి పలు సూచనలు చేశారు హాస్పిటల్ ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు నడిపించాలని గతంలో డెలివరీలు కూడా జరిగేవని కచ్చితంగా ఆసుపత్రి సేవలు మరింతగా పెరగాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డా. ప్రసన్న రాణి, డా. వైష్ణవి, ఇంజనీర్ రాజశేఖర్, లెక్చరర్ సురేష్, సూపర్వైజర్ సాయిరాం, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story