Kurnool: సచివాలయ ఉద్యోగుల అక్రమ అరెస్టులను ఖండించిన సీఐటీయూ
Kurnool: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కర్నూలు పాతబస్తీ గడియారం ఆసుపత్రి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Kurnool: సచివాలయ ఉద్యోగుల అక్రమ అరెస్టులను ఖండించిన సీఐటీయూ
కర్నూలు: సచివాలయ ఉద్యోగులపై సర్కారు ఉక్కు పాదం మోపిన అక్రమ అరెస్టులను ఖండించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఓల్డ్ సిటీ గడియారం హాస్పిటల్ దగ్గర సిఐటియుగా నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్ నగర ఉపాధ్యక్షులు ఎస్ ఎం.డి షరీఫ్ వారు మాట్లాడుతూ ఐ ఆర్ పిఆర్సి ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా 40 వేల కోట్లు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది.
సచివాల ఉద్యోగాల పైన ప్రభుత్వ వేధింపులు పని ఒత్తిడి చిన్నచిన్న ఉద్యోగాలు మీద ఈ స్థాయి ఒత్తిడి అవసరమా సచివాలయ ఉద్యోగుల గ్రామాల్లో వార్డులో ఉత్సాహాలు జరిగితే టాయిలెట్లు దగ్గర కాపుల పెడుతున్నారు పెట్రోల్ కొరత రాగానే బంకుల దగ్గర కాపలా పెడుతున్నారు ఇలా ప్రతిదీ వారికి అప్పగించి వేధిస్తున్నారు పండుగలు ఆదివారం కూడా లేకుండా అడ్డమైన పనులు చేస్తున్నారు.
ఆఫీసులో లేకుండా రోడ్డు వెంట తిప్పుతున్నారు సచివాల ఉద్యోగులకు వెట్టి చాకిరి చేయించి దుర్మార్గమ దుర్మార్గంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత టార్చర్ పెట్టలేదు. కర్నూలు నగరంలో పని ఒత్తిడి వల్ల సచివాలయ ఉద్యోగి చనిపోవడం జరిగింది.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మందులు ఆహారం ప్రభుత్వ సేవలను చేరవేయడంలో సచివాలయ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేసింది ప్రజలకు చేరవేయడం Sir ఓటర్లు నమోదు కూడా చాలా పకడ్బందీగా చేయడం జరిగింది సర్వేలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు వరకు సచివాల ఉద్యోగులు ముందుండి పనిచేస్తున్నారు.
అలాంటి యువతను గురించి ఉద్యోగాలపై మరింత పని భారం మోపడం సరికాదు వారి సమస్యలను పరిష్కరించాలి. ఈ కార్యక్రమంలో షేక్ అహ్మద్ జాఫర్ అజీజ్ సయ్యద్ గిడ్డయ్య అంజి మన్నెం దావీద్ మనీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




