Kurnool: హోర్డింగుల బకాయిలు వెంటనే చెల్లించాలి

Kurnool: కర్నూలులో హోర్డింగుల బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. అనుమతి లేని హోర్డింగులను తొలగిస్తామని హెచ్చరించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 8 Oct 2026 6:12 PM IST
Kurnool
X

Kurnool: హోర్డింగుల బకాయిలు వెంటనే చెల్లించాలి

కర్నూలు: నగరంలో హోర్డింగుల ఏజెన్సీలు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. బుధవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో హోర్డింగుల ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, చెల్లించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులకు ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు.

బకాయిలను వెంటనే చెల్లించకపోతే అనధికార హోర్డింగులుగా పరిగణించి తొలగిస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్ ఆదాయానికి గండి వేస్తే సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జీ డీసీపీ శబ్నం శాస్త్రీ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL