Kurnool: కర్నూలులో డిజిటల్ విప్లవం.. VOAలకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ
Kurnool: కర్నూలు జిల్లాలో 908 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు (VOAs) స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.
Kurnool: కర్నూలులో డిజిటల్ విప్లవం.. VOAలకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ
కర్నూలు: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOAs) లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో డి.ఆర్.డి.ఎ-సెర్ప్ కు సంబంధించిన వివోఏ లకు మొబైల్ ఫోన్స్ ను కలెక్టర్ పంపిణీ చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ..
గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా జిల్లాలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్లు కీలకంగా ఉపయోగపడతాయన్నారు. జిల్లాలోని మొత్తం 908 మంది VOAలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అత్యాధునిక 5G సదుపాయం కలిగిన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్లు గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సంఘాల ఆర్థిక లావాదేవీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సులభతరం అవుతుందన్నారు. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని వేగవంతంగా గ్రామీణ ప్రజలకు చేరవేయడంలో స్మార్ట్‌ఫోన్లు కీలకంగా ఉపయోగపడతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సాంకేతికత వినియోగం మరింత విస్తరించాలని, VOAs ఈ సదుపాయాన్ని సమర్థంగా వినియోగించి సంఘాల పురోగతికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి రమణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




