Kurnool: కర్నూలు జిల్లాలో బాలకార్మిక నిర్మూలనకు చర్యలు: కలెక్టర్ సిరి

Kurnool: కర్నూలు జిల్లాలో బాలకార్మిక నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కార్మిక అధికారులను కలెక్టర్ డా. ఏ. సిరి కలెక్టరేట్ సమావేశంలో ఆదేశించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Aug 2026 3:47 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు జిల్లాలో బాలకార్మిక నిర్మూలనకు చర్యలు: కలెక్టర్ సిరి

వి రామమోహన్ కర్నూలు

జిల్లాలో బాల కార్మిక నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు: జిల్లాలో బాల కార్మిక నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ లో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో నియమించడం చట్టవిరుద్ధమని కలెక్టర్ స్పష్టం చేశారు. బాల కార్మిక నిర్మూలనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా క్షేత్రస్థాయిలో తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని, అవగాహన కార్యక్రమాలను ఇంకా విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో అక్షరాస్యత పెంపుతో పాటు బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రత్యేక తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇళ్లలో, వాణిజ్య సంస్థల్లో, పరిశ్రమల్లో బాలకార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బాలకార్మికులు లేదా వెట్టి చాకిరీకి సంబంధించిన సమాచారం అందించేందుకు సంబంధిత శాఖల సంప్రదింపు నంబర్లు, చైల్డ్ హెల్ప్‌లైన్ వివరాలను సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో అనాథలు, పాక్షిక అనాథలు మరియు బాల కార్మికులుగా గుర్తించబడిన చిన్నారులను తక్షణమే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు లేదా అనాథ శరణాలయాల్లో చేర్పించి వారికి విద్య, సంరక్షణ అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమావేశంలో అదనపు ఎస్పి హుస్సేన్ పీరా, కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, లెప్రసీ అధికారి డా.భాస్కర్ రాజు, cwc ఛైర్మన్ జుబేదా బేగం తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story