Kurnool: సీఎం చంద్రబాబు పర్యటన.. కర్నూలులో ఏర్పాట్లు ముమ్మరం

Kurnool: ఈ నెల 24న సీఎం నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్లాంట్‌లో పర్యటించనున్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 22 Jun 2026 5:51 PM IST
Kurnool
X

Kurnool: సీఎం చంద్రబాబు పర్యటన.. కర్నూలులో ఏర్పాట్లు ముమ్మరం

కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో 24 వ తేదీన పర్యటిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

24 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరిలో జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్ లో పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, వ్యూ పాయింట్, బహిరంగ సభ, స్టాళ్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు పరిశీలించారు.

కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ కో ఆర్డినేట్స్, లైటింగ్ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించారు. మైనింగ్ వ్యూ పాయింట్, బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలిస్తూ, బహిరంగసభకు సుమారు 5 వేల నుంచి 10 వేల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

వేదిక ఏర్పాట్లు, ప్రజలకు తాగునీరు, భోజన వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్, సీటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలపై ఎస్పీ, కలెక్టర్ చర్చించి పోలీస్ అధికారులకు సూచనలు ఇచ్చారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర,జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వర రెడ్డి, డ్వామా పిడి నరసింహ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్ కుమార్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story