Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్!

Kurnool: ఈవీఎంల భద్రతలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దు: కర్నూలు కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 31 Aug 2026 1:48 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్!

Kurnool: ఈవిఎం ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న ఈవిఎమ్ గోడౌన్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈవిఎమ్ గోడౌన్ ను పరిశీలిస్తూ ఈవిఎం ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.

ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలన్నారు. ఈవిఎం లకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు, సీసీ టీవీ పర్యవేక్షణ, ఎంట్రీ ఎగ్జిట్ రిజిస్టర్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల విభాగం, భద్రతా సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.. కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరిoటెండెంట్ మురళి, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story