Kurnool: కర్నూలులో ఉపాధి కల్పన కార్యక్రమాలు

Kurnool: కర్నూలులో డీడీయూ-జీకేవై 2.0 పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి.. కస్టమర్ ఇంగ్లీష్, టెలికాం రంగాల్లో ఉపాధి అవకాశాలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Jun 2026 6:39 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఉపాధి కల్పన కార్యక్రమాలు

కర్నూలు: గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు నాణ్యమైన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDU-GKY 2.0) కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి పేర్కొన్నారు.

సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో డీడీయూ-జీకేవై 2.0 ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల ప్రచార పోస్టర్‌ను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఆధునిక ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించడం ద్వారా వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. డీడీయూ-జీకేవై 2.0 ద్వారా కస్టమర్ ఇంగ్లీష్, హాస్పిటాలిటీ, టెలికాం, గ్రీన్ జాబ్స్ వంటి డిమాండ్ ఉన్న రంగాల్లో 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు సంబంధిత రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్లేస్‌మెంట్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నైపుణ్యాల పెంపుదల ద్వారా యువత ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు తమ కుటుంబాల అభివృద్ధికి కూడా తోడ్పడగలరని అన్నారు. జిల్లాలో అర్హులైన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ సుబ్బయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ప్రాజెక్ట్ డైరెక్టర్ రమణారెడ్డి, నైపుణ్యాబివృద్ధి ఉపాధి కల్పన అధికారి దీప్తి, జిల్లా పరిషత్ సీఈవో వెంకటరమణారెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకరాజు, స్వర్ణ గ్రామ /స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story