Kurnool: మత్తు పదార్థాల నియంత్రణకు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి దిశా నిర్దేశం

Kurnool: కర్నూలు జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణపై కలెక్టరేట్‌లో ఎన్‌కార్డ్ సమావేశం. గంజాయి, డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశం.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Aug 2026 7:25 AM IST
Kurnool
X

Kurnool: మత్తు పదార్థాల నియంత్రణకు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి దిశా నిర్దేశం

Kurnool: మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్ (ఎన్‌కార్డ్ - NCORD) కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించి మత్తు పదార్థాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు , యువత క్రమశిక్షణతో ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని , మాదక ద్రవ్యాల వ్యసనం వారి జీవితాలను , కుటుంబాలను , సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాలు, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని పోలీసు, ఎక్సైజ్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ మరియు ఇతర అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మనమీద నమ్మకంతో విద్యార్థులను వసతి గృహాల్లో వదులుతారని అటువంటివారు మత్తుకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని 30 పడకల డి అడిక్షన్ సెంటర్లో అందిస్తున్న సేవలు గురించి సంబంధిత డాక్టర్ లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. డి అడిక్షన్ సెంటర్లో చికిత్స తర్వాత బాగు అయిన వారి తల్లిదండ్రులతో మీడియాలో ప్రచారం చేయించాలని ఆదేశించారు. ఆర్టీసీ కొరియర్ సర్వీస్ లో మత్తు పదార్థాలు రవాణాలు అరికట్టాలని వాటిపై నిఘా ఉంచాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో విద్యాసంస్థలలో మరియు పరిసరాలలోని దుకాణాలలో , పండ్ల విక్రయాల దగ్గర విద్యాశాఖ అధికారులు ముత్తు పదార్థాల వినియోగం జరగకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. మత్తు పదార్థాల సరఫరా చేసే వ్యక్తుల ను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యం అని, అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు నిఘా ఉంచి అధికారులకు సమాచారాన్ని అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. మత్తు పదార్థాలు సేవించినట్లు గుర్తించడానికి అవసరమైన టెస్ట్ కిట్ లను వినియోగించాలని ఆదేశించారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి కర్నూలు అడిషనల్ ఎస్పీ హుశేన్ పీరా మాట్లాడుతూ... జిల్లాలో కౌతాళం మరి కొన్ని ప్రదేశాలలో రహస్యం గా గంజాయి సాగు చేయడం గుర్తించడం జరిగిందని ఆ విషయంపై రైతులను ప్రశ్నించగా పశువులకు వ్యాధులు సోకకుండా మరియు బాగా పనిచేయటానికి వినియోగిస్తామని తెలిపారని , కానీ ఆ పంటను ధ్వంసం చేయడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు.జిల్లా లోని వ్యవసాయ అధికారులు వీటిపై నిఘా ఉంచి పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి వినియోగం చేసే విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిపించి చర్యలు తీసుకొని కౌన్సిలింగ్ చేస్తామని తెలియజేశారు. విద్యార్థులను మొదటి నుండి సిగరెట్ కు దూరంగా ఉంచితే మత్తు పదార్థాలకు అలవాటు కారని ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ తెలిపారు.

పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో పల్లె బాటలో భాగంగా ఈగల్ టీమ్ లు అవగాహన కార్యక్రమాలు నిర్వహింస్తున్నట్లు తెలియజేసారు.ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలి అన్నారు . సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని అన్నారు.

అంతకు ముందు జిల్లాలో డ్రగ్స్ తీసుకున్న వారికి టెస్ట్ నిర్వహించి నలుగురిని పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని వారిని వైజాగ్ రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించి చికిత్స ఇప్పిస్తున్నామని అలాగే గాంజా సేవించిన ఇద్దరిని కర్నూలు డి ఆడిక్ట్ సెంటర్ కి పంపి చికిత్స ఇప్పిస్తున్నామని ఈగల్ టీం ఎస్సై రమేష్ నాయక్ జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.

ఈ సమావేశంలో డిటిసి శాంతకుమారి,డీఎంహెచ్వో కామేశ్వరరావు , డి ఈ ఓ సుధాకర్ , ఆర్ ఐ ఓ లాలెప్ప, జి జి హెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు , డి ఆర్డిఏ పిడి శ్రీధర్ రావు , డిసీ లేబర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్ సి అధికారి రాధిక, క్లస్టర్ యూనివర్సిటీ , కాలేజీలా అధికారులు , లీగల్ టీం ఎస్సై రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story