Kurnool: కర్నూలు అధికారులకు కలెక్టర్ సిరి కీలక ఆదేశాలు

Kurnool: ఈ నెల 30న కర్నూలు జిల్లా పర్ల వద్ద హెచ్‌పీసీఎల్ ఎల్‌పీజీ పైప్‌లైన్ మాక్ ఎక్సర్‌సైజ్. విపత్తు నిర్వహణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సమీక్ష.

V RAMAMOHAN, KURNOOL
Published on: 24 April 2026 7:43 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు అధికారులకు కలెక్టర్ సిరి కీలక ఆదేశాలు

Kurnool: శుక్రవారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమాండెంట్ ఆదిత్య కుమార్, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఈ నెల 30 వ తేదీన రాష్ట్రమంతటా నిర్వహించనున్న మాక్ ఎక్సర్సైజ్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ, ఈ నెల 30 వ తేదీన పర్ల వద్ద హెచ్ పీసీఎల్ (HPCL) LPG పైప్ లైన్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఆర్డీవో ఇన్సిడెంట్ కమాండర్ గా వ్యవహరిస్తారన్నారు. ప్రమాదం జరిగినటపుడు ఏమేమి చర్యలు తీసుకుంటామో, ఆ విధంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వైద్య సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

పర్లకు దగ్గరలో ఉన్న విశ్వభారతి హాస్పిటల్ లో వైద్య సహాయక చర్యలు, అలాగే జనరల్ హాస్పిటల్ లో బెడ్ల ఏర్పాటు, వైద్య సిబ్బంది, 108, అంబులెన్స్ ల ఏర్పాటు తదితర చర్యలన్నీ తీసుకోవాలని హాస్పిటల్స్ సూపరింటెండెంట్, డి ఎం హెచ్ వో లను ఆదేశించారు. అలాగే SDRF, ఫైర్, పోలీస్, ఆర్టీసీ తదితర శాఖలకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, డిఎంహెచ్ఓ డా. కామేశ్వర ప్రసాద్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీసీ హెచ్ ఎస్ డా. జఫ్రుల్లా, SDRF, ఫైర్, పోలీస్ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story