Kurnool: కర్నూలు జిల్లాలో పెండింగ్ బయోమెట్రిక్ అప్‌డేట్లు పూర్తి చేయాలి
Kurnool: కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 93 వేల బయోమెట్రిక్ అప్‌డేట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
Kurnool: కర్నూలు జిల్లాలో పెండింగ్ బయోమెట్రిక్ అప్‌డేట్లు పూర్తి చేయాలి
Kurnool: జిల్లాలో పెండింగ్ లో ఉన్న 5 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న 56,790 మందికి, 15 సంవత్సరాలు పైన ఉన్న 37,007 మందికి మొత్తం 93 వేల మందికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు నిర్వహించాల్సిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ యూఐడీఏఐ ప్రతినిధిని ఆదేశించారు..
ప్రతి మండలంలో ఆధార్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ ను పూర్తి చేసేందుకు ప్రతి నెలా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని, సంబంధిత క్యాంపులను విద్యాశాఖ, ఐసిడిఎస్, పోస్టల్ తదితర సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు.
జిల్లాలో ఆధార్ నమోదు, అప్‌డేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పెండెన్సీని నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలన్నారు. ఆధార్ సేవలు అందించే కేంద్రాల్లో ప్రజలకు అందించే వివిధ సేవలకు సంబంధించిన రుసుముల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..
దివ్యాంగులకు ఆధార్ సేవలు సులభంగా అందించేందుకు రెండు రోజుల ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ , స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి భాస్కర్ నాయుడు, ఎల్డిఎమ్ మోహన్, ఐసిడిఎస్ పిడి విజయ తదితరులు పాల్గొన్నారు..




