Kurnool: ప్రతి గ్రామంలో శ్రామికులకు ఉపాధి పనులు కల్పించాలి

Kurnool: కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి ఓర్వకల్లులో పర్యటించి వీబీజీ రామ్ జీ పథకం పనులను పరిశీలించారు. శ్రామికులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశం.

V RAMAMOHAN, KURNOOL
Published on: 13 Oct 2026 5:02 PM IST
Kurnool
X

Kurnool: ప్రతి గ్రామంలో శ్రామికులకు ఉపాధి పనులు కల్పించాలి

కర్నూలు: ప్రతి గ్రామములో వీబీజీ రామ్ జీ పథకం కింద శ్రామికులకు పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. మంగళవారం ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో జలధార - జలహారతి 2.0 కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులను కలెక్టర్ పరిశీలించారు.

కలెక్టర్ మాట్లాడుతూ వీబీజీ రామ్ జీ పథకం కింద నీటి సంరక్షణ పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.. గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేని వారికి వీబీజీ రామ్ జీ పథకం కింద పనులు కల్పించాలని, పనులు కల్పించలేదనే ఫిర్యాదులు ఎక్కడ రాకూడదని కలెక్టర్ డ్వామా పిడి ని ఆదేశించారు.. వీబీ - జీ రామ్ జీ పథకం కింద శ్రామికులకు తగిన పనిదినాలు కల్పించడంతో పాటు, వారికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ డ్వామా పిడి ని ఆదేశించారు..

నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తూ పనులకు ఎంతమంది శ్రామికులు హాజరవుతున్నారు, ఉదయం ఏ సమయానికి పనులకు వస్తున్నారు, శ్రామికులకు తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.. మండలంలో శ్రామికులకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..

అనంతరం శ్రామికులతో మాట్లాడుతూ రోజువారీ వేతనాలు సక్రమంగా అందుతున్నాయా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ సరుకులు సకాలంలో పంపిణీ చేస్తున్నారా, అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయా అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఇళ్లు లేని అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి, వారికి గృహ నిర్మాణ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ హౌసింగ్ పిడి ని, ఓర్వకల్లు తహసిల్దార్ లను ఆదేశించారు. రెండు రోజుల్లోగా అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ ఓర్వకల్లు తహసిల్దార్ ను ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పిడి నరసింహా రెడ్డి, ఓర్వకల్లు తహసిల్దార్ విద్యా సాగర్, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL