Kurnool: కారుణ్య నియామకాలతో 9 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు!
Kurnool: కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద 9 మంది అభ్యర్థులకు ఉద్యోగ ఉత్తర్వులు అందజేశారు.
Kurnool: కారుణ్య నియామకాలతో 9 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు!
Kurnool: కారుణ్య నియామకాల కింద రెవెన్యూ శాఖ లో 8 మందికి ఆఫీసు సబార్డినేట్, ఒక్కరికి జూనియర్ అసిస్టెంట్ లుగా ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.
సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఇది మంచి అవకాశం అని, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగాలు పొందిన వారంతా మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులుగా ఎదిగే అవకాశం ఉందని, ఇప్పటినుంచే అన్ని అంశాలను నేర్చుకుని, కెరీర్ ను డెవలప్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు..
జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపడం వల్ల తమకు ఉద్యోగ నియామకం జరిగిందని అభ్యర్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమంలో లో ఇన్చార్జి డిఆర్ఓ చిరంజీవి, సంబంధిత సెక్షన్ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.




