Kurnool: మొల్లగవల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొల్లగవల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం. కాంగ్రెస్‌తోనే గ్రామాభివృద్ధి: పూల రామాంజినేయులు.

Bheemalinga, Aluru
Published on: 3 Nov 2026 11:47 AM IST
Kurnool
X

Kurnool: మొల్లగవల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొల్లగవల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి పూల రామాంజినేయులు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మొల్లగవల్లి గ్రామం అభివృద్ధి బాటలో పయనించిందని పేర్కొన్నారు.

ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన సమయంలో గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య ఆసుపత్రి, రోడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ప్రాంతీయ పార్టీల పాలనలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

గతం లొ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపిస్తే మొల్లగవల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పూల రామాంజినేయులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru