Kurnool: ఎమ్మిగనూరులో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన!
Kurnool: ఎమ్మిగనూరులో నిత్యావసర సరుకుల ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. బియ్యం బస్తాలు, గ్యాస్ సిలిండర్లు మోస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
Kurnool: ఎమ్మిగనూరులో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన!
Kurnool: బియ్యం బస్తాలు, గ్యాస్ సిలిండర్, వంట నూనె డబ్బాలను మోస్తూ సీపీఐ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్‌లో ధర్నా చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.




