Kurnool: మద్యం మత్తులో భార్య దారుణ హత్య!

Kurnool: కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో దారుణం. మద్యం మత్తులో భార్య పద్మావతిని గొడ్డలితో నరికి చంపిన భర్త పాపారాయుడు.

G Jagadeesh, Pathikonda
Published on: 5 May 2026 12:31 PM IST
Kurnool
X

Kurnool: మద్యం మత్తులో భార్య దారుణ హత్య!

కర్నూలు జిల్లా: కృష్ణగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయ బొంతిరాళ్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యతో గొడవపడి భర్త గొడ్డలితో దాడి చేయడంతో ఆమె మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన కురువ పాపారాయుడు సుమారు (40) సం., తండ్రి అచ్చన్న, మద్యం సేవించి ఇంటికి వచ్చి తన భార్య పద్మావతితో వాగ్వాదానికి దిగాడు.

ఈ వాగ్వాదం క్రమంగా తీవ్రమై, కోపోద్రిక్తుడైన పాపారాయుడు ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని పద్మావతి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాల కారణంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు పద్మావతి, (35)పాపారాయుడు దంపతులకు వివాహమై సుమారు 18 సంవత్సరాలు కాగా, వారికి ఒక కూతురు ఉంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పాపారాయుడు పారిపోయినాడు. క్రిష్ణగిరి పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story