Kurnool: పోలీసు క్రీడాకారులకు కిట్లు అందజేసిన డీఐజీ కోయ ప్రవీణ్

Kurnool: గుంటూరులో జరగనున్న ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనే కర్నూలు రేంజ్ పోలీసు క్రీడాకారులకు డీఐజీ కోయ ప్రవీణ్ శనివారం స్పోర్ట్స్ కిట్లు అందజేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Aug 2026 7:47 PM IST
Kurnool
X

Kurnool: పోలీసు క్రీడాకారులకు కిట్లు అందజేసిన డీఐజీ కోయ ప్రవీణ్

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ గుంటూరు లో ( సెప్టెంబర్ 1 తేదీ నుండి సెప్టెంబర్ 3 వరకు ) మూడు రోజుల పాటు నిర్వహించనున్న నేపథ్యంలో కర్నూలు రేంజ్ నుంచి పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి కర్నూలు రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ శనివారం కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ పోలీసు క్రీడాకారులను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి కర్నూలు రేంజ్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, క్రమశిక్షణను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని డీఐజీ తెలిపారు.

ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కర్నూలు రేంజ్‌కు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఐలు చంద్రబాబు నాయుడు, తేజామూర్తి, తిక్కస్వామి, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, స్పోర్ట్స్ మీట్‌కు ఎంపికైన పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story