Kurnool: పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి: వైసీపీ నేతలు!
Kurnool: గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Kurnool: పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి: వైసీపీ నేతలు!
కర్నూల్: గ్రామ పంచాయతీ ఎన్నికలను సామరస్యంగా నిర్వహించాలని డీఐజీ కోయ ప్రవీణ్ గారికి వినతి పత్రం అందజేశామని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరామని చెప్పారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, దాడులు, అక్రమ అరెస్టులు జరిగాయని ఆరోపించారు.
ఫ్యాక్షన్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, నంద్యాల జిల్లాలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సరైన రీతిలో నిర్వహించలేదని, కక్ష సాధింపు, బెదిరింపు రాజకీయాలతో స్థానిక ఎన్నికలు జరిగాయని జిల్లా అధ్యక్షుడు కాండసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను చట్టబద్ధంగా నిర్వహించాలని డీఐజీ కోయ ప్రవీణ్ గారిని కలిసి వివరించినట్లు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ, మండల పరిషత్ ఎన్నికలను ప్రభుత్వం సరైన రీతిలో నిర్వహించలేదని విమర్శించారు.
ఇప్పుడు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి కాబట్టి, వాటిని నిష్పక్షపాతంగా నిర్వహించాలని డీఐజీని కోరినట్లు తెలిపారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో సంఘర్షణలు, దాడులు, దౌర్జన్యాలు దేశం మొత్తం చూసిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు ఉందని, కానీ ఈ దాడులతో బీహార్ రాష్ట్రంగా మారిందని వ్యాఖ్యానించారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి దౌర్జన్యాలు చేశారని, నామినేషన్ పత్రాలను టీడీపీ శ్రేణులు చించేశారని ఆరోపించారు. ఈ దారుణాలపై డీఐజీ కోయ ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాజకీయాలు పుట్టిందే గ్రామాల నుంచేనని, అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరిపించాలని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు.




