Kurnool: కర్నూలులో ఘనంగా మెగా పేరెంట్స్ సమావేశం

Kurnool: కర్నూలులో జరిగిన మెగా పీటీఎంలో పాల్గొన్న కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు. తల్లికి వందనం నిధులు, పాఠశాల అభివృద్ధిపై చర్చ.

V RAMAMOHAN, KURNOOL
Published on: 24 July 2026 7:46 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఘనంగా మెగా పేరెంట్స్ సమావేశం

కర్నూలు: మేగా పేరెంట్స్ మీటింగ్ లో కురుబ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కురువ వెంకటరాముడు మాట్లాడుతూ ప్రభుత్వము తల్లికి వందనం పథకం. డబ్బు జమ: ₹13,000 తల్లి ఖాతాలో జమ చేయడం జరిగిందని అదేవిధంగా ఈ నెల 30వ తేదీన రెండో విడత అమౌంట్ జమ అవుతుందని పాఠశాల అభివృద్ధికి ₹2,౦౦౦.

ఈ డబ్బును స్కూల్ లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫ్యాన్లు, క్లాస్ రూమ్ రిపేర్లకు ఎలా ఖర్చు చేస్తారో తల్లిదండ్రులకు వివరించడ పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలపై సూచనలు తీసుకోవడ విద్యార్థుల చదువు & పనితీరు హాజరు 75% కంటే తక్కువ ఉంటే డబ్బు రాదని పరీక్షల్లో పిల్లల మార్కులు, బలహీనతలు చర్చిస్తూ డ్రాపౌట్ స్కూల్ మానేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

విద్యార్థుల భద్రత స్కూల్ బస్సు, క్యాంపస్ భద్రత ప్రభుత్వ కొత్త పథకాలు విద్యకు సంబంధించిన ఇతర స్కీమ్ ల గురించి వివరించడం జరిగింది. అనంతరం డైరెక్టర్ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ,మధ్యాహ్నం భోజనం పథకాన్ని అమలు గురించి ఉపాధ్యాయులతో చర్చించి, విద్యార్థులకు మంచి నాణ్యత మైన, పౌష్టికాహారం అందించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ఎంపీటీసీ మద్దిలేటి, చంద్ర శేఖర్, సుంకన్న,కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story