Halaharvi: 61 ఎకరాల మఠం భూమిపై వివాదం: హాలహర్వి

Halaharvi: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం జంగమర హోసళ్లిలో శ్రీ పట్టద స్వామి మఠానికి చెందిన 61.08 ఎకరాల భూమిపై వివాదం తెరపైకి వచ్చింది. సమగ్ర విచారణకు డిమాండ్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 12 Oct 2026 3:04 PM IST
Halaharvi
X

Halaharvi: 61 ఎకరాల మఠం భూమిపై వివాదం: హాలహర్వి

కర్నూలు జిల్లా: హాలహర్వి మండలం జంగమర హోసళ్లి గ్రామంలో శ్రీ పట్టద స్వామి మఠానికి చెందిన భూమిపై వివాదం తెరపైకి వచ్చింది.

సర్వే నంబర్ 169లో మఠానికి చెందిన 63.52 ఎకరాల భూమి ఉండగా, కాలువలకు పోను 61.08 ఎకరాల భూమి తమ ఆధీనంలో ఉందని మఠం పీఠాధిపతి పేర్కొంటున్నారు.

అయితే, తమను సంప్రదించకుండానే దేవాదాయ శాఖ అధికారులు ఉనికిలో లేని శ్రీ రత్తడ స్వామి మఠం పేరుతో సెక్షన్ 43 రిజిస్టర్ తయారు చేశారని ఆరోపిస్తున్నారు.

శ్రీ పట్టద స్వామి మఠానికి సంబంధించిన రికార్డులను పరిగణనలోకి తీసుకుని, వివాదాస్పద రిజిస్టర్‌ను రద్దు చేసి, సమగ్ర విచారణ జరపాలని అధికారులను కోరుతున్నారు.మఠం భూములపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL