Kurnool: ప్యాలకుర్తి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సిరి!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డా. ఏ.సిరి తనిఖీ చేశారు. చిన్నారులతో మాట్లాడి పోషకాహార నాణ్యతను పరిశీలించారు.
Kurnool: ప్యాలకుర్తి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సిరి!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలోని అంగన్వాడీ-1 కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని పరిసరాలు, చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం మరియు పోషకాహార పంపిణీ తదితర అంశాలను ఆమె పరిశీలించారు.
అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారులతో జిల్లా కలెక్టర్ గారు ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలతో మమేకమై వారి పేర్లు, చదువు, అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల మరియు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు పౌష్టికాహారం అందుతున్నాయా, ఆహారం నాణ్యతగా ఉందా అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ప్రతిరోజూ సమయానికి, నాణ్యమైన మరియు పోషక విలువలు కలిగిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.




