Kurnool: కర్నూలు కోర్టులో ప్యానల్ లాయర్ల విధుాలపై సమీక్షా సమావేశం

Kurnool: కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్‌లో ప్యానల్ లాయర్ల విధులు మరియు కేసుల పరిష్కారంపై హైబ్రిడ్ మోడ్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 Aug 2026 6:58 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు కోర్టులో ప్యానల్ లాయర్ల విధుాలపై సమీక్షా సమావేశం

కర్నూలు: జి.కబర్థి, చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారి సూచనల మేరకు కమిటీ మెంబర్స్ అయినా మొదటి అదనపు జిల్లా జడ్జి పి. కమలాదేవి, బి. లీలా వెంకట శేషాద్రి, సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు, వారు కర్నూలు కోర్టు కాంపౌండ్ లో గల న్యాయ సేవా సదన్ నందు " ప్యానల్ లాయర్స్ విధులు పై రివ్యూ మీటింగ్" హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా ప్యానల్ లాయర్స్ విధులు, చట్టపరమైన సలహాలు, కేసుల వివరాలు మరియు పరిష్కారము మొదలగు అంశాలను వివరించారు.

అలాగే కేసుల యొక్క స్థితిగతులను తెలుసుకొని వాటిని ఏ విధంగా త్యరిత గతిన పరిష్కరించాలో అనే దానిపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, ప్యానల్ న్యాయ వాదులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story