Kurnool: సోమవారం నగరవ్యాప్తంగా నీటి సరఫరా నిలిపివేత!

Kurnool: కర్నూలు అశోక్ నగర్ నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా సోమవారం నగరమంతటా తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ ప్రకటన.

V RAMAMOHAN, KURNOOL
Published on: 16 Aug 2026 12:41 PM IST
Kurnool
X

Kurnool: సోమవారం నగరవ్యాప్తంగా నీటి సరఫరా నిలిపివేత!

Kurnool: నగరంలోని అశోక్ నగర్‌లోని నీటి శుద్ధి కేంద్రంలో నీటి సరఫరా నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉన్నందున, సోమవారం నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

తొలుత పలు కాలనీల్లో మాత్రమే తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని భావించినప్పటికీ, నీటి శుద్ధి కేంద్రంలోని అన్ని యంత్రాల సామర్థ్యాన్ని తనిఖీ చేసి, అవసరమైన నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉన్నందున నగరమంతా నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని తెలిపారు. కావున ప్రజలు గమనించి, సహకరించాలని కమిషనర్ కోరారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story