Kurnool: కర్నూలులో ఎస్ఐఆర్ తనిఖీ.. బీఎల్వోలకు ఈఆర్వో కీలక ఆదేశాలు

Kurnool: కర్నూలు ఛత్రీబాగ్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన కమిషనర్ చల్లా ఓబులేసు. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌లో పొరపాట్లకు తావుండొద్దని స్పష్టీకరణ.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 July 2026 7:27 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఎస్ఐఆర్ తనిఖీ.. బీఎల్వోలకు ఈఆర్వో కీలక ఆదేశాలు

కర్నూలు: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) విధుల్లో బిఎల్వోలు పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. బుధవారం 216 పోలింగ్ బూత్ పరిధిలో ఛత్రీబాగ్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈఆర్వో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచొద్దని బిఎల్వోలకు సూచించారు. ప్రతి కుటుంబం వద్దకు తప్పనిసరిగా వెళ్ళాలని, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్యూమరేషన్ ఫాంలను పూజించాలని పేర్కొన్నారు. ఒకే దఫాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, అవసరమైతే అదనపు సమయాన్ని కేటాయించి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.

ప్రతి రోజు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనుల పురోగతిని నమోదు చేసుకోవాలని, రోజువారీ పనితీరును సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story