Kurnool: ప్రభుత్వ కళాశాలలో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రగడ కోటయ్య జయంతి. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్, ఏఎస్ఐ నారాయణ పాల్గొని ఘన నివాళులు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 25 July 2026 1:25 PM IST
Kurnool
X

Kurnool: ప్రభుత్వ కళాశాలలో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు!

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో స్వాతంత్ర్య సమరయోధుడు, చేనేత ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది కలిసి ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన 3 టౌన్ ఏఎస్ఐ నారాయణ మాట్లాడుతూ, ప్రగడ కోటయ్య స్వాతంత్ర్య సమరంలో విశేష పాత్ర పోషించడమే కాకుండా, చేనేత కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. యువత మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, ప్రగడ కోటయ్య జీవితం త్యాగం, సేవా నిరతి, నిబద్ధతకు ప్రతీక అని అన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమని, విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. మహనీయుల జీవిత చరిత్రలను చదవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, అలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు స్ఫూర్తిని అందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసన్న కుమార్, మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, సోమేష్, ఉల్గోజి రావు, శారధి పటేల్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story